Kunthi Putrudu Songs - Le Le Baba Lyrics - S.P.Balasubramanyam
| Singer | S.P.Balasubramanyam |
| Composer | Ilayaraja, |
| Music | Aditya Music |
| Song Writer | Jaaladi |
Lyrics
లే లే బాబా నిద్దురలేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగా తలుపు తీసేరా బాబా
లేలే లేలే లే లే బాబా నిద్దురలేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
వేగు చుక్క తిలకామెట్టి వెద మంత్ర పువ్వులు పెట్టి
ఈ ఈ ఈ ఆ ఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆ
వేగు చుక్క తిలకమెట్టి వేదం మంత్ర పువ్వులు పెట్టి
పాద సేవ చేసుకునే వేళా దాటిపోయెనని
ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికి
పెద్ద కొడుకంటే ముద్దెలే ఏ తండ్రికి
అందుకనే గుండె నీ గురు పీఠమయినది
ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది
అంతకుమించిన భాగ్యమేదిరా బాబా
లే లే బాబా నిద్దురలేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగా తలుపు తీసేరా బాబా
లే లే బాబా నిద్దురలేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నీవేనని
రూపములనేకములయిన శ్రీ సాయిని
నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై
కుమ్మరించు వరములా సుఖ శాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటే లోటే లేదుగా బాబా
లే లే బాబా నిద్దురలేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగా తలుపు తీసేరా బాబా
లే లే బాబా నిద్దురలేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
0 Comments